ఎండాకాలంలో చల్లగా ఉంటుందని ఎక్కువగా బీర్ తాగుతున్నారా..
- July 07, 2019
సమ్మర్ వచ్చిందంటే చాలు.. ఆ వేడిని తట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఇందులో మద్యంప్రియులు మాత్రం బీర్ బాటిల్ ఎత్తి.. దించకుండా తాగేస్తుంటారు.. దీని వల్ల కడుపులో చల్లగా ఉందంటూ సంబరపడతారు. ఎందుకిలా అంటే.. అవును బీరులో నీటిశాతం ఎక్కువగా ఉంది.. అది ఆరోగ్యానికి మంచిదంటూ చెప్పడం మరో విశేషం. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు నిపుణులు. సాధారణంగా మానవశరీరంలో ఏడీహెచ్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది శరీరంలోని నీటిశాతాన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే.. ఆల్కహాల్ కలిసిన బీర్‌ని తాగడం వల్ల ఈ హార్మోన్ దెబ్బతింటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
అసలు ఎండాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంతమంచిది. ముఖ్యంగా ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు వైద్యులు. చల్లని బీర్ తాగడం వల్ల శరీరంలో వేడి చేస్తుందని.. ఇబ్బందులకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగలాంటి పానీయాలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడాలంటే నీటిని ఎక్కువ తీసుకోవాలి కానీ, నీటిశాతం ఎక్కువున్న బీర్ కాదంటూ మరో కొత్త విషయాన్ని చెబుతున్నారు. కాబట్టి.. ఎండలున్నాయంటూ బీర్ బాటిల్స్ ఖాళీ చేసే మద్యంప్రియులు కాస్తా జాగ్రత్తగా ఉంటే మంచిదని చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







