యూఏఈలో ఫేక్ కాస్మొటిక్స్ వార్నింగ్ జారీ
- July 08, 2019
అబుదాబీ మునిసిపాలిటీ 366 బాక్సుల కౌంటర్‌ఫిట్ కాస్మొటిక్ ప్రోడక్ట్స్‌ని వివిధ కమర్షియల్ ఔట్‌లెట్స్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫేక్ గూడ్స్ గురించి వచ్చిన విశ్వసనీయ సమాచారంతో సోదాలు నిర్వహించిన అధికారులు, ఆయా కమర్షియల్ ఔట్‌లెట్స్ నుంచి పెద్దయెత్తున స్వాధీనం చేసుకున్న ఫేక్ గూడ్స్‌ని ధ్వంసం చేయనున్నారు. వీటిల్లో అత్యధికంగా కాస్మొటిక్స్ అలాగే వైటెనింగ్ మరియు మెడికల్ క్రీమ్స్ వున్నట్లు గుర్తించారు. ప్రముఖ బ్రాండ్లని పోలి వుండేలా డూప్లికేట్స్‌ని మార్కెట్‌లోకి తెస్తున్నారు కొందరు అక్రమార్కులు. మునిసిపాలిటీ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సయీద్ మొహ్మద్ కర్వాష్ మాట్లాడుతూ, వినియోగదారులు ఫేక్ ప్రొడక్ట్స్ విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, అనుమానం వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తక్కువ ధరకే వస్తున్నాయన్న ఆలోచనతో ఫేక్ ప్రోడక్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తే, అవి ఆరోగ్యానికి హానికరమవుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







