బాలీవుడ్ డాన్స్, ఫిట్‌నెస్‌పై ఐసీసీ వర్క్ షాప్
- July 08, 2019
దోహా: ఇండియన్ కల్చరల్ సెంటర్, బాలీవుడ్ డాన్స్ మరియు ఫిట్‌నెస్‌పై వర్క్ షాప్‌ని నిర్వహించింది. మొత్తం 40 మంది పార్టిసిపెంట్స్ ఈ వర్క్‌షాప్‌లో పాలుపంచుకున్నారు. అశోకా హాల్లో జరిగిన ఈ వర్క్‌షాప్‌ని భావనా సాగర్ నాయక్ నేతృత్వంలో నిర్వహించారు. 10 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్య వసున్నవారు ఇందులో పాల్గొన్నారు. పలు బాలీవుడ్ సాంగ్స్‌కి వీరంతా డాన్సులు చేశారు. స్ట్రెచింగ్, ఏరోబిక్స్, స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ మరియు డాన్స్ ఫిట్నెస్ వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. కాగా, యోగా ఫర్ డాన్సర్స్ అండ్ కాంటెంపరరీ డాన్స్ అనే అంశంపై భావనా నాయక్ ఓ వర్క్ షాప్‌ని నిర్వహించబోతున్నారు. ఈ వర్క్‌షాప్‌లో పార్టిసిపేట్ చేయాలనుకునేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రవేశం మాత్రం ఉచితం. భావనా సాగర్ నాయక్‌కి 16 ఏళ్ళ అనుభవం వుంది. వివిధ రకాలైన డాన్సులపై పరిశోధన, ప్రయోగాలు భావనాసాగర్ ప్రత్యేకత.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







