" ఉబెర్ ఎయిర్" పేరుతో హెలికాప్టర్ సర్వీసులు
- July 10, 2019
న్యూయార్క్: ప్రముఖ కార్ల అగ్రిగేటర్ సంస్థ ఉబెర్ తాజాగా " ఉబెర్ ఎయిర్" పేరుతో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించింది. అయితే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న మాన్ హట్టన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి జాన్ ఎఫ్.కెన్నడి ఎయిర్ పోర్టు వరకూ ఈ సేవలను ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలను ఉబెర్ డైమండ్, ప్లాటినం కస్టమర్లకు మాత్రమే పరిమితం చేశామని వెల్లడించారు. కాగా ఇందుకోసం న్యూజెర్సీకి చెందిన హెలీఫ్లైట్గ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. తాము రోజుకు 8 నుంచి 10 సర్వీసులను ప్రస్తుతం నడపాలని నిర్ణయం తీసుకున్నామనీ, 8 నిమిషాల ప్రయాణానికి రూ.15,000 వరకూ వసూలు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ సేవలను భారత్ సహా ఇతర దేశాలకు విస్తరించే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కంపెనీ ప్రతినిధులు అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







