పాకిస్థాన్‌లో న్యూస్ యాంకర్ దారుణ హత్య
- July 10, 2019
పాకిస్థాన్: పాకిస్థాన్‌లోని ఓ న్యూస్ యాంకర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కేఫ్ బయట ఆయనను దుండగుడు కాల్చి చంపాడు. బోల్ న్యూస్ అనే చానల్‌లో మురీద్ అబ్బాస్ న్యూస్ యాంకర్. ఖయబన్-ఇ-బుఖారీ ప్రాంతంలో కేఫ్ వద్ద కారులో ఉన్న అబ్బాస్‌పై అతీఫ్ జమాన్ అనే వ్యక్తి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అబ్బాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన అబ్బాస్ స్నేహితుడు ఖిజార్ హయత్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, కాల్పుల అనంతరం ఆత్మహత్యకు యత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. చాతీలో కాల్చుకోవడంతో అతడి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







