క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం
- July 11, 2019
కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. సంక్షోభం మరింత ముదిరింది. రెండు మూడు రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పరిణామాల నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోపాటు అసమ్మతులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న నిర్ణయానికి కుమరస్వామి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బడ్జెట్ సమావేశాలకు ముందే ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి మాట్లాడారు కుమారస్వామి. ఆయన సలహా మేరకే సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తే బయటి నుంచి మద్దతివ్వాలని జేడీఎస్ నిర్ణియించినట్టు తెలిసింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







