కర్ణాటక సంక్షోభం..ఎమ్మెల్యేలకు విప్‌ జారీ

కర్ణాటక సంక్షోభం..ఎమ్మెల్యేలకు విప్‌ జారీ

బెంగళూరు: శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ అయింది. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలకమైన ఆర్థిక బిల్లులు ఆమోదం పొందే దిశలో సభకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ మొత్తం 78 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ అయింది. రాష్ట్ర చీఫ్‌ విప్‌ గణేష్‌ ప్రకాష్‌ హుక్కేరి ఈ మేరకు విప్‌ జారీ చేశారు. ఆర్థిక బిల్లులపై ఓటింగ్‌ జరిగే సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని విప్‌లో సూచించారు. విప్‌ను ఉల్లంఘిస్తే పార్టీ ఫిరాయింపుల నిషేధచట్టం ప్రకారం భారతీయ రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 10 ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని విప్‌లో హెచ్చరించారు.

ఇప్పటికే శాసనసభత్వాలకు రాజీనామా సమర్పించిన 13 మంది ఎమ్మెల్యేలకు కూడా విప్‌ను జారీ చేశామని ఆయన మీడియాకు చెప్పారు. ఇదిలావుండగా జేడీఎస్‌ కూడా తన ఎమ్మెల్యేలందరికీ గురువారం రాత్రి విప్‌ను జారీ చేసింది. ఈ విప్‌ల ఆధారంగా శాసనసభలో శుక్రవారం వీరు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయకపోతే అనర్హత వేటు పడనుంది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాని, మంత్రులుగా నియమితులయ్యేందుకు గాని ఎంతమాత్రం అవకాశం ఉండదు.

Back to Top