ఇమ్మోరల్‌ యాక్ట్‌: 14 మంది మహిళల అరెస్ట్‌

ఇమ్మోరల్‌ యాక్ట్‌: 14 మంది మహిళల అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీసులు 14 మంది మహిళల్ని అరెస్ట్‌ చేశారు. 'ఇమ్మోరల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నందుకుగాను' వీరిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. మస్కట్‌ పోలీస్‌ కమాండ్‌, 14 మంది మహిళల్ని అరెస్ట్‌ చేయడం జరిగిందనీ, ఇందులో వేర్వేరు దేశాలకు చెందినవారు వున్నారనీ, పబ్లిక్‌ మోరల్స్‌ని దెబ్బ తీసేలా వీరు వ్యవహరిస్తున్నారనీ రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. అరెస్ట్‌ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వివరించారు.

 

Back to Top