రెక్లెస్‌ డ్రైవింగ్‌: షార్జాలో 1,393 బైక్‌ల సీజ్‌

రెక్లెస్‌ డ్రైవింగ్‌: షార్జాలో 1,393 బైక్‌ల సీజ్‌

షార్జా పోలీస్‌ స్టేషన్‌ 1,393 మోటర్‌ బైక్స్‌ని అలాగే బైసికిల్స్‌ని స్వాధీనం చేసుకుంది. రెక్లెస్‌ రైడర్స్‌పై ఉక్కుపాదం మోపే దిశగా నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌ ద్వారా ఈ సీజ్‌లు జరిగినట్లు ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ - షార్జా పోలీస్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మొహమ్మద్‌ అలాయ్‌ అల్‌ నక్బి చెప్పారు. సీజ్‌ చేసిన వాహనాల్లో కొన్నిటిపై ట్రాఫిక్‌ రెగ్యులేషన్స్‌ ఉల్లంఘన కేసులు నమోదయినట్లు తెలిపారాయ. రెక్లెస్‌ డ్రైవింగ్‌తో ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నారంటూ రెక్లెస్‌ డ్రైవర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు లెఫ్టినెంట్‌ కల్నల్‌ అల్‌ నక్బి. క్యాంపెయిన్‌ కొనసాగుతుందనీ, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. 

 

Back to Top