పీక్స్ కి చేరిన చెన్నై నీటి ఎద్దడి
- July 12, 2019
హైదరాబాద్: చెన్నై మహానగరం తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ వెల్లోర్ నుంచి చెన్నైకు ఓ ప్రత్యేక రైలును తీసుకువెళ్తున్నారు. నీటి బోగీలతో ఆ రైలు ఇవాళ ఉదయం జోలార్‌పేట్ రైల్వే స్టేషన్ నుంచి కాసేపటి క్రితం బయలుదేరింది. రైల్వే వ్యాగన్ల ద్వారా నీటిని చెన్నైకు తీసుకురానున్నట్లు ఇటీవల ప్రభుత్వం పేర్కొన్నది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆ రైలు చెన్నై స్టేషన్‌కు చేరుకోనున్నది. 50 బోగీల్లో సుమారు 50 వేల లీటర్ల నీళ్లు ఉన్నాయి. విల్లివక్కం వద్ద రాష్ట్ర మంత్రి ఆ రైలుకు స్వాగతం పలకనున్నారు. వ్యాగన్లలో ఉన్న నీటిని.. కిల్‌పాక్ వాటర్ వర్క్స్‌కు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కిల్‌పాక్ వాటర్ వర్క్స్ నుంచి నీటిని నగరమంతా సరఫరా చేయనున్నారు. మొత్తం రెండు రైళ్ల ద్వారా నీటిని తరలించనున్నారు. ఒక రైలు జోలార్‌పేట్ నుంచి, మరో రైలు అవది రైల్వే యార్డ్ నుంచి బయలుదేరనున్నాయి.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







