లేబర్‌ చట్టం ఉల్లంఘన 22 మంది వలసదారుల అరెస్ట్‌

లేబర్‌ చట్టం ఉల్లంఘన 22 మంది వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: లేబర్‌ మరియు రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనకు సంబంధించి 22 మంది వలసదారుల్ని అరెస్ట్‌ చేశారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. విలాయత్‌ ఆఫ్‌ నిజ్వాలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి. నిజ్వా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌తో కలిసి దఖ్లియా పోలీస్‌ కమాండ్‌ ఈ అరెస్టులు చేపట్టిందని అధికారులు వివరించారు. లేబర్‌ మరియు రెసిడెన్షియల్‌ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను అరెస్టులు చేయడం జరిగింది. మరోపక్క, రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ 19 మోటర్‌సైకిల్స్‌ని ట్రాఫిక్‌ ఉల్లంఘనల నేపథ్యంలో సీజ్‌ చేశారు. విలాయత్‌ అల్‌ హమ్రాలో ఈ సీజ్‌ చోటు చేసుకుంది. 

 

Back to Top