కోల్‌కతా, ఇండోర్‌లకు దుబాయ్‌ నుంచి డైరెక్ట్‌ విమానాల్ని ప్రకటించిన ఎయిర్‌ ఇండియా

కోల్‌కతా, ఇండోర్‌లకు దుబాయ్‌ నుంచి డైరెక్ట్‌ విమానాల్ని ప్రకటించిన ఎయిర్‌ ఇండియా

యూఏఈ: భారతదేశంలోని రెండు నగరాలకు డైరెక్ట్‌ విమానాల్ని నడుపుతున్నట్లు తాజాగా ఎయిర్‌ ఇండియా వెల్లడించింది. ఇండియాలోని కోల్‌కతాతోపాటు, ఇండోర్‌కి కొత్తగా డైరెక్ట్‌ విమానాల్ని నడుపుతున్నట్లు ఎయిర్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. దుబాయ్‌ నుంచి ఇండోర్‌కి డైరెక్ట్‌ విమానంలో ప్రయాణం 4 గంటలు. టిక్కెట్‌ ధర ఒక్కో ప్రయాణీకుడికి 1,100 నుంచి 1,200 దిర్హామ్‌ల వరకు వుంటుంది. కోల్‌కతా విమానం 4 గంటల 35 నిమిషాల ప్రయాణం తీసుకుంటుంది. ధర 1,200 దిర్హామ్‌ల వరకు వుంటుంది.

 

Back to Top