TRS NRI సెల్ ఆధ్వర్యంలో మెంబర్షిప్ డ్రైవ్
- July 14, 2019
ఖతర్:తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు సందర్భంగా TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రారంభించిన సందర్భంగా, TRS NRI ముఖ్య సలహాదారు కల్వకుంట్ల కవిత, TRS NRI కో- ఆర్డనేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు దాదాపు నలభై దేశాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగలా సాగుతోంది. ఈ మేరకు TRS ఖతర్ శాఖ అధ్యక్షులు అబ్బగౌని శ్రీధర్ మరియు ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికేని ఆధ్వర్యంలో ఈ రోజు దోహా ఖతార్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ అబ్బాగౌని మాట్లాడుతూ TRS మరియు కేసిఆర్ జనాకర్షక పాలనకు వివిధ వర్గాల ప్రజలందరి నుండి విపరీతమైన స్పందన ఉందని, కేవలం తెలంగాణ వాసులే కాకుండా వివిధ రాష్ట్రల ప్రజలు TRS పార్టీ సభ్యత్వాన్ని తీసు కోడానికి స్వతహాగా ఫోన్ లు చేసి మరి సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే NRI లు తమ తమ నియోజకవర్గల్లో సైతం సభ్యత్వ నమోదు లో ముందున్నా రని ఇటీవలే జగిత్యాల జిల్లా మెట్పల్లి, జగ్గసాగర్ లో TRS Qatar ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్ కోరం ఆధ్వర్యంలో అతి పెద్ద సభ్యత్వ నమోదు శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రపంచ లో అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు ను కట్టిన తెలంగాణ లో ఉన్న TRS ప్రభుత్వం ప్రపంచ ద్రుష్టి ని ఆకర్షీస్తోందని,వివిధ దేశాల ప్రజల మధ్య చర్చనీయాంశం అయిందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి. కేసీఆర్ ని అభినందించారు.
ఈ సందర్భంగా పలువురు NRI లు మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన ఈ ప్రాజెక్టు ను తము తమ తదుపరి భారత పర్యటనలో ప్రత్యక్షంగా వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)

తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







