హజ్ కోసం ఒమన్ నుంచి 14,000 మంది యాత్రికులు
- July 17, 2019
మస్కట్: ఈ ఏడాది మొత్తం 14,000 మంది యాత్రికులు ఒమన్ నుంచి మక్కా పర్యటనకు వెళ్ళనున్నారు. హజ్ రిట్యువల్స్ కోసం వీరంతా మక్కాకి వెళ్ళనున్నారు. వీరిలో 13,500 మంది ఒమనీయులు కాగా, 250 మంది అరబ్స్, 250 మంది నాన్ అరబ్స్ వున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్‌మెంట్స్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ ఈ విషయాన్ని పేర్కొంది. 26,000 హజ్ అప్లికేషన్స్ ఈ ఏడాది వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఒమన్ అఫీషియల్ హజ్ డెలిగేషన్, జులై 28న పయనమవనుంది. రెలిజియస్ గైడెన్స్ రిప్రెజెంటేటివ్స్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ డెలిగేషన్, సూపర్ విజన్ ఆఫ్ హజ్ కంపెనీస్, మెడికల్ డెలిగేషన్ మరియు మీడియా ఇందులో వుండటం జరుగుతుంది. ఒమన్ హజ్ మిషన్ హెడ్ షేక్ సుల్తాన్ బిన్ సయీద్ అల్ హినాయ్ మాట్లాడుతూ, మినిస్ట్రీ 85 కంపెనీలను యాత్రికుల ట్రాన్స్‌పోర్టేషన్‌కి అనుమతిచ్చినట్లు తెలిపారు. హజ్ యాత్రీకుల్లో అత్యధికులు 18 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యనున్నవారే. వీరి శాతం 88.2గా వుంది. 65 శాతం మంది ఫిలిగ్రిమ్స్ ఆకాశ మార్గంలో వెళుతుండగా, 35 శాతం మంది రోడ్డు మార్గంలో వెళతారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







