కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

కువైట్‌ సిటీ: రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి కువైట్‌లో. 28 వరకు ఈ పెరుగుదల వుంటుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల 50 డిగ్రీలను దాటి వుంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రనామర్‌ అదెల్‌ అల్‌ సాదౌన్‌ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వేడి చాలా ఎక్కువగా వుంటుందని చెప్పారు. నార్తర్లీ విండ్స్‌ కారణంగా గడచిన కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయనీ, ఇవి ముందు ముందు పెరగబోతున్నాయని పేర్కొన్నారు. వాతావరణం, గాలుల తీవ్రతను బట్టి మారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని. ఈ నేపథ్యంలో అత్యధికంగా లేదంటే అత్యల్పంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన వివరించారు. ఆగస్ట్‌లో హ్యుమిడిటీ సాధారణ స్థితికి రానుంది. 

 

Back to Top