ఇండియన్ టెక్కీలకు గుడ్ న్యూస్ ఇచ్చిన అమెరికా
- July 17, 2019
వాషింగ్టన్ : భారత ఐటీ నిపుణులకు శుభవార్త అందింది. గత కొంతకాలంగా వలసల విషయంలో ఆంక్షలు విధిస్తున్న అగ్రరాజ్యం గ్రీన్ కార్డుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిభ ఆధారంగా ఉద్యోగులకు ఇచ్చే గ్రీన్ కార్డుల కోటాను 12 నుంచి 57శాతానికి పెంచేందుకు సిద్ధమమైంది. ఈ మేరకు ట్రంప్ సీనియర్ అడ్వైజర్ జారెడ్ కష్నర్ వైట్ హౌస్‌లో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ప్రకటన చేశారు.
ట్రంప్ చేపట్టిన వలస సంస్కరణల ప్రాజెక్టుకు కష్నర్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే కాంగ్రెస్ ముందుకు రానుంది. కొత్త విధానం ద్వారా ప్రతిభ ఉన్నవారు గ్రీన్ కార్డులు పొందే అవకాశముంటుందని, దీంతో పాటు వచ్చే పదేళ్లలో అమెరికా పన్ను ఆదాయం 500బిలియన్ డాలర్లకు పెరుగుతుందన్నది కుష్నర్ అభిప్రాయం.
అమెరికాలో ప్రస్తుతం అమలవుతున్న వలస విధానం చాలా పాతది. ఈ విధానంలో ప్రతిభ ఆధారంగా కేవలం 12శాతం మందికి మాత్రమే గ్రీన్ కార్డులు ఇస్తున్నారు. అయితే కెనడాలో ఇది 53 శాతం ఉండగా, న్యూజిలాండ్‌లో 59, ఆస్ట్రేలియాలో 63, జపాన్‌లో 52శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోనూ దీన్ని 57శాతానికి పెంచాలని ట్రంప్ ప్రతిపాదించారు.
దాదాపు ఐదున్నర దశాబ్దాల క్రితం అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. ప్రస్తుత విధానం వల్ల నైపుణ్యం కలిగిన యువతకు అవకాశాలు లభించడంలేదని, అందుకే కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. తాజా నిర్ణయం హెచ్ 1బీ వీసాతో అమెరికాకు వెళ్లి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత టెక్కీలకు మేలు చేకూర్చనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







