తప్పిపోయిన తనయుడి కోసం తల్లడిల్లుతున్న తండ్రి

తప్పిపోయిన తనయుడి కోసం తల్లడిల్లుతున్న తండ్రి

షార్జా:తన కుమారుడు తప్పిపోవడంతో ఓ తండ్రి తల్లడిల్లుతున్నాడు. తప్పిపోయిన కుర్రాడి వయసు 15 ఏళ్ళు కాగా, అతని పేరు మొహమ్మద్‌ పర్వేజ్‌. అతని తండ్రి మొహమ్మద్‌ అఫ్తాబ్‌ అలామ్‌, తన కుమారుడి ఆచూకీ తెలిపినవారికి 5,000 దిర్హామ్‌లు బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. పర్వేజ్‌, జులై 4వ తేదీ నుంచి కన్పించడంలేదు. మరోపక్క, పర్వేజ్‌ ఆచూకీ కోసం పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. పర్వేజ్‌ కుటుంబం ఇండియా నుంచి వచ్చి యూఏఈలో స్థిరపడింది. 

 

Back to Top