ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

మస్కట్‌: నార్తరన్‌ మరియు ఈస్టర్న్‌ ఒమన్‌లలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం వున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మిటియరాలజీ పేర్కొంది. ఖరీఫ్‌ సీజన్‌ సందర్భంగా దోఫార్‌ ప్రాంతంలో వర్షాలు కురవనున్నాయి. హజార్‌ మౌంటెయిన్స్‌ మీదుగా వర్షాలతోపాటు థండర్‌ షవర్స్‌ కూడా పడతాయని పేర్కొన్నారు. అల్‌ షర్కియాలోని ఇబ్రా, అల్‌ బతినాలోని అల్‌ రుస్తాక్‌, అల్‌ దహిరాహ్‌లోని ఇబ్రి మరియు అల్‌ దఖ్లియాలోని నిజ్వాలో వర్షాలు కురిసే అవకాశం వుంది. ఖరీఫ్‌ సీజన్‌కి ఈ వర్షాలు ఎంతో ఉపయోగకరంగా వుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

Back to Top