తప్పిపోయిన 15 ఏళ్ళ బాలుడు క్షేమం

తప్పిపోయిన 15 ఏళ్ళ బాలుడు క్షేమం

అజ్మన్:జులై 4 నుంచి ఆచూకీ కన్పించకుండా పోయిన 15 ఏళ్ళ బాలుడు మొహమ్మద్‌ పర్వేజ్‌ ఎట్టకేలకు దొరికాడు. అజ్మన్‌లో అతన్ని గుర్తించారు. అజ్మన్‌ ఆచూకీ తెలియడంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అజ్మన్‌ పోలీసులు, పర్వేజ్‌ ఆచూకీని కనుగొని, అతన్ని పట్టుకున్నారు. పర్వేజ్‌ తండ్రి మొహమ్మద్‌ అఫ్తాబ్‌ అలామ్‌కి ఈ మేరకు సమాచారం అందించారు. అయితే, ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు.? అతన్ని ఎవరైనా కిడ్నాప్‌ చేశారా.? అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. కాగా, కుమారుడి ఆచూకీ తెలిపినవారికి 5000 దిర్హామ్‌ల నజరానా కూడా ప్రకటించారు పర్వేజ్‌ తండ్రి. 

Back to Top