జంపింగ్‌ రెడ్‌ లైట్స్‌: 4,000 మందికి పైగా మోటరిస్టులకు జరీమానా

జంపింగ్‌ రెడ్‌ లైట్స్‌: 4,000 మందికి పైగా మోటరిస్టులకు జరీమానా

అబుదాబీ: వేలాది మంది వాహనదారులకు ఈ ఏడాది అప్పుడే జరీమానాల్ని విధించారు ట్రాఫిక్‌ అధికారులు. రెడ్‌ లైట్‌ సిగ్నల్‌ జంపింగ్‌కి సంబంధించి 4,367 మంది వాహనదారులకు జరీమానాలు విధించినట్లు అబుదాబీ పోలీసులు వెల్లడించారు. తొలి ఆరు నెలల్లో ఈ ఉల్లంఘనలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, రెడ్‌ సిగ్నల్‌ లైట్‌ జంప్‌ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 52 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మోటరిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్‌ లైట్‌ జంప్‌ చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారుల భద్రత కోసమే ట్రాఫిక్‌ రూల్స్‌ వున్నాయని, వాటిని పాటించాల్సి వుందని అధికారులు తెలిపారు.  

Back to Top