72 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీస్
July 20, 2019
మస్కట్: అల్ దఖ్లియాలో 72 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అథారిటీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, అల్ దఖ్లియా పోలీస్ అలాగే నిజ్వా స్పెషల్ యూనిట్ చేపట్టిన స్పెషల్ జాయింట్ ఆపరేషన్ ద్వారా ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది. లేబర్ మరియు రెసిడెన్స్ చట్టం ఉల్లంఘనలకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయని రాయల్ ఒమన్ పోలీస్, ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసిన ప్రటకనలో పేర్కొంది. ఇదిలా వుంటే, అల్ దఖ్లియాలో పలు మోటార్ బైక్స్‌ని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది.