18 మంది ఇండియన్స్‌ని అరెస్ట్‌ చేసిన ఇరాన్‌

18 మంది ఇండియన్స్‌ని అరెస్ట్‌ చేసిన ఇరాన్‌

అరేబియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ సీజ్‌ చేసిన ఆయిల్‌ ట్యాంకర్‌కి సంబంధించి 18 మంది ఇండియన్లతోపాటు, పలువురు ఫిలిప్పీన్‌ క్రూని విడిపించేందుకు ఇండియా అలాగే ఫిలిప్పీన్‌ ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భారత విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఇరాన్‌ ప్రభుత్వంతో తమ డిప్లమాట్స్‌ చర్చలు ప్రారంభించారనీ, 18 మంది ఇండియన్‌ క్రూ విడుదలకు ప్రయత్నిస్తున్నారనీ పేర్కొన్నారు. మనీలా డిపార్ట్‌మెంట్‌ ఆఫారిన్‌ ఎఫైర్స్‌ కూడా తమ దేశ అంబాసిడర్లు ఇరాన్‌ అథారిటీస్‌తో చర్చలు కొనసాగిస్తున్నారని తెలిపింది. క్రూ సిబ్బందికి గాయాలపై ఎలాంటి సమాచారం లేదని ఫిలిప్పీన్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ సరాహ్‌ లౌ అరియోలా చెప్పారు. 

Back to Top