సౌదీ అరేబియా లో రోడ్డు ప్రమాదం...ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి

సౌదీ అరేబియా లో రోడ్డు ప్రమాదం...ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి

తెలంగాణ:జన్నారం మండలంలోని రోటిగూడకు చెందిన ఉప్పు మల్లేష్‌ (40) సౌదీ అరేబియా లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మల్లేష్‌ బ్రతుకుదెరువు నిమిత్తం మూడు సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా వెళ్ళాడు. మల్లేష్‌కు భార్య భాగ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లేష్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే వార్త వినగానే బంధుమిత్రులు, భార్య, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా తెప్పించాలని కోరారు.

Back to Top