నేడే ఏపీ గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు
- July 22, 2019
ఏపీ నూతన గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ నెల 24న ఆయన అమరావతిలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్‌గా ఉన్న నరసింహన్ వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం నరసింహన్ విజయవాడకు రానుండగా.. సీఎం జగన్‌తో పాటు కీలక నేతలకు విందు ఇవ్వనున్నారు. ఏపీ గవర్నర్‌గా తనకు సహాయసహకారాలు అందించినందుకు నరసింహన్ ఈ విందును ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో.. ఆయనకు ఏపీ ప్రభుత్వం తరఫున వీడ్కోలు పలకనున్నారు. గేట్ వే హోటల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
కాగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలిసారి గవర్నర్‌గా వచ్చారు నరసింహన్. అనంతరం 2014లో రాష్ట్ర విభజన తరువాత ఇరు తెలుగు రాష్ట్రాలకు ఆయనే ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఏపీకి కొత్త గవర్నర్ రావడంతో.. ఇకపై ఆయన తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా ఉండనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..