దుబాయ్ నుంచి ప్రయాణించేవారికి దుబాయ్ మాల్ వద్ద బోర్డింగ్ పాస్‌లు
- July 24, 2019
దుబాయ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేవారికి దుబాయ్ మాల్ వద్ద బోర్డింగ్ పాస్‌లు లభ్యం కానున్నాయి. మాల్లో ఈ మేరకు కొత్త ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు బ్యాగేజ్ చెకింగ్ కూడా ఇక్కడే చేసుకోవడానికి వుంది. బ్యాగేజీని ఇక్కడే చెక్ చేసి, ఎయిర్ క్రాఫ్ట్ వద్దకు తరలిస్తారు నిర్వాహకులు. డుబ్జ్ అనే బ్యాగేజీ టెక్నాలజీ మరియు లాజిస్టిక్స్ కంపెనీ ఈ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. ఫ్లై దుబాయ్, సౌదియా, ఫైలనాస్, చైనా సదరన్, కువైట్ ఎయిర్ వేస్, గల్ఫ్ ఎయిర్, సౌదీ గల్ఫ్, రాయల్ జోర్డానియన్ మరియు ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు తమ సేవల్ని దుబ్జ్ అందిస్తోంది. ఫ్లై దుబాయ్ ఇండియాలోని ముంబై మరియు ఢిల్లీతోపాటు పాకిస్తాన్, ముల్తాన్ తదితర దేశాలకు విమానాల్ని నడుపుతోంది. కాగా, బ్యాగేజీ - బోర్డింగ్ పాస్ సర్వీసులు 99 దిర్హామ్‌ల నుంచి అందుబాటులో వుంటాయి. ఒక ప్యాసింజర్‌కి చెక్ ఇన్ పీజుతోపాటు ఓ పీస్ లగేజ్ ఇందులో లభిస్తుంది. అదనపు లగేజ్‌కి 40 దిర్హామ్‌లు వసూలు చేస్తారు. 10 బ్యాగ్‌ల వరకు 249 దిర్హామ్‌లకు సేవల్ని అందించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







