పుల్వామా ఉగ్రదాడితో మాకు సంబంధం లేదు: ఇమ్రాన్ ఖాన్
- July 24, 2019
వాషింగ్టన్ : భారత్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు సంబంధంలేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ దాడి భారత్ అంతర్గత సమస్యతో కశ్మీర్ ప్రజలు చేసిన పనేనన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ వాషింగ్టన్‌లోని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడిన జైషే ఈ మొహమ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడినట్లు అంగీకరించడంతో తమ దేశం బదనాం అయిందన్నారు. కానీ ఈ దాడితో పాక్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. జైషే మోహమ్మద్ పాక్ చెందినదే అయినప్పటికి అది కశ్మీర్లో కూడా ఉందని, భారత్‌లోని సమస్యలతోనే ఈ ఉగ్రదాడి జరిగిందని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
'భారత భద్రతా బలగాల వేధింపులకు గురైన ఓ కశ్మీర్ యువకుడే తిరుగుబాటు చేస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కానీ ఈ దాడి పాకిస్తాన్ చేయించినట్లు ప్రచారం జరిగింది' అని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఈ ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్‌పై భారత వాయుసేన ప్రతీకారదాడులు చేపట్టడం.. పాక్ కూడా దాడులు చేసే ప్రయత్నం చేయడం.. తదానంతరం చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే.
అమెరికాలో పర్యటన సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సోమవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. 'రెండు వారాల క్రితం మోదీతో సమావేశమైనప్పుడు కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఆయన నన్ను కోరారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని భారత్, పాక్‌లు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఇరు దేశాలు కోరితే తన వంతుగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన'ని పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఇమ్రాన్ ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించారు. ట్రంప్ మధ్యవర్తిత్వం తమకు ఇష్టమేనని ఆయన తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు భారత్‌లో పెనుదుమారాన్నే లేపాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేసింది. కశ్మీర్ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







