నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

- July 24, 2019 , by Maagulf
నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

మస్కట్‌: ఓ చిన్నారి నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. దోఫార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. వాడి దర్బాత్‌లో చిన్నారి నీట మునిగిన అంశం తమ దృష్టికి రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. రెస్క్యూ టీమ్‌ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, చిన్నారిని కాపాడలేకపోయామనీ, అప్పటికే ఆ చిన్నారి మృతి చెందడం జరిగిందని అధికారులు వివరించారు. బీచ్‌ని సందర్శించేవారు లేదా పాండ్స్‌ అలాగే వాడిల వద్దకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని ఈ సందర్భంగా సివిల్‌ డిఫెన్స్‌ హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com