రక్తపు మడుగులో భారత వలసదారుడు
- July 25, 2019
కువైట్ సిటీ: భారతీయ వలసదారుడొకరు తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించిన స్పాన్సరర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పారామెడిక్స్ ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. వఫ్రాలోని ఫామ్ బయట ఆ వ్యక్తిని గుర్తించారు. అదాన్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ప్రస్తుతం బాధితుడు వైద్య చికిత్స పొందుతున్నాడు. రెండు చేతుల మీదా బాధితుడికి గాయాలు వున్నాయనీ, మెడపైనా బలమైన గాయం వుందనీ వైద్యులు పేర్కొన్నారు. పారామెడిక్స్ అతన్ని వద్దకు చేరుకునే సరికే అసస్మారక స్థితిలో వున్నాడని అధికారులు తెలిపారు. అతను కోలుకుంటే తప్ప, ఏం జరిగిందనేది చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







