వేతనాలు అందక 4,000 మంది వలసదారుల ఆవేదన
- July 25, 2019
కువైట్: నాలుగు నెలలుగా వేతనాలు అందక ఆవేదన చెందుతున్నామంటూ 4,000 మందికి పైగా వలసదారులు ఆందోళన బాట పట్టారు. వారితో సంప్రదింపులు చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ లేబర్ వర్గాలు వెల్లడించాయి. షేక్ జబెర్ అల్ అహ్మద్ స్టేడియం వద్ద ఈ ఆందోళన జరిగింది. ఆందోళన చేపట్టినవారిలో ఎక్కువమంది ఆసియాకి చెందిన వలసదారులే వున్నారు. బాధిత వలసదారుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, తాము పనిచేస్తున్న కంపెనీ తమ రెసిడెన్సీ పర్మిట్స్ని రెన్యూవల్ చేయని కారణంగా తాము అక్రమంగా దేశంలో నివాసం వుంటున్నట్లుగా మారిందని ఆందోళన చేస్తున్న వలసదారుల్లో కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ ఆయిల్ కంపెనీతో కాంట్రాక్ట్ వున్న ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ వీరిని బాధితులుగా మార్చింది.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







