ట్రాఫిక్ ఉల్లంఘనలు: వలసదారుడికి 1.14 మిలియన్ దిర్హామ్‌ల జరీమానా
- July 26, 2019
ఆసియాకి చెందిన వసలదారుడిని షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై 106 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనలకు సంబంధించి 1.138 మిలియన్ దిర్హామ్‌లు జరీమానా చెల్లించాల్సి వుంది. 31 ఏళ్ళ డ్రైవర్, ప్రయాణీకుల్ని చట్ట వ్యతిరేకంగా తన వహనంలో ఎక్కించుకుంటుండగా గుర్తించిన పోలీస్ పెట్రోల్, నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. జులై 24న నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, విచారణలో అతను 106 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిందని వాసిత్ పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ కాస్‌ముల్ చెప్పారు. వాహనదారులు రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







