బందరు పోర్టు తెలంగాణకు అమ్మడం లేదు--మేకపాటి గౌతమ్ రెడ్డి
- July 26, 2019
అమరావతి:బందరు పోర్టును ఐదేళ్లలో పూర్తి చేస్తామని, తెలంగాణ రాష్ట్రానికి అమ్ముకుంటామనేది వాస్తవం కాదన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని..ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కు జరగాలంటే..కేంద్రం అనుమతి ఉండాలని తెలిపారు. సీఎం జగన్తో చర్చించి పోర్టుపై ఒక నిర్ణయానికి వస్తామని సభకు తెలిపారు.
2019, జులై 26వ తేదీ శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్. బందరు పోర్టుపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. దీనికి మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రైవేటు డెవలపర్ చేయకపోతే..ప్రభుత్వమే దీనిని నిర్వహిస్తామని మంత్రి మేకపాటి తెలిపారు.
అంతకు ముందు పలువురు సభ్యులు దీనిపై మాట్లాడారు. ఈ పోర్టును ప్రభుత్వమే నిర్మించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బాబు హయాంలో అవసరానికి మించి భూ సేకరణ చేశారని, మొత్తం 4వేల ఎకరాల భూ సేకరణ చేసినట్లు చెప్పారు. రూ. 10 కోట్లతో శంకుస్థాపనతో చేశారని సభలో వెల్లడించారు. బందరు పోర్టుకు దశబ్దాల చరిత్ర ఉందని..ఈ పోర్టుపై టీడీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు ఎమ్మెల్యే జోగి రమేష్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ సేకరణ చేయాలని అనుకున్నారని..బలవంతంగా భూ సేకరణ చేయాలని బాబు చూశారని తెలిపారు. భూ సేకరణ నోటిఫికేషన్ను ఎప్పుడు రద్దు చేస్తారని సభలో ప్రశ్నించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..