భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఇరాన్
- July 28, 2019
ఇరాన్:ఇరాన్ వెళ్లే భారతీయులకు మల్టీ ఎంట్రీ వీసాలను ఇవ్వనున్నట్టు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇరాన్-భారత్ మధ్య సత్సంబంధాలు ఊపందుకున్నాయి. ఇరాన్ నుంచి చమురు దిగుమతిని నిలిపివేయాలని.. అమెరికా ఆంక్షల కారణంగా చబహర్ నౌకాశ్రయం విస్తరణకు కూడా బడ్జెట్ తగ్గించాలని భారత్ నిశ్చయించుకున్నప్పటికీ ఇరాన్ ఇలా ప్రకటించడం విశేషం. ఇరాన్ ప్రకటించిన ఈ మల్టీ ఎంట్రీ వీసా కాల పరిమితి సంవత్సరం పాటు ఉండనుంది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని వీసా ఆన్ అరైవల్ కాల పరిమితిని కూడా 30 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించింది. చట్టపరమైన విషయాలలో పరస్పర న్యాయ సహాయ ఒప్పందంపై కూడా ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. పౌర, వాణిజ్య విషయాలపై పరస్పర న్యాయ సహాయంపై ఒప్పందం గురించి ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్టు విదేశాంగ శాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ గురువారం పార్లమెంట్లో తెలిపారు. మే 14న న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-ఇరాన్ జాయింట్ కాన్సులర్ కమిటీ సమావేశం(జేసీసీఎమ్) సందర్భంగా ఈ ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







