రాజ్యసభలో షార్ట్ సర్క్యూట్ కలకలం
- July 29, 2019
రాజ్యసభలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. బెంచ్ వద్ద ఉండే మైక్ నుంచి పొగ రావడంతో సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఉదయం రాజ్యసభ సమావేశమైన తర్వాత మాజీ ఎంపీ ఎస్ జైపాల్‌రెడ్డి మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. ఆ తర్వాత నాలుగో వరుసలో కూర్చున్న భాజపా ఎంపీ కేజే ఆల్ఫోన్స్ మైక్ నుంచి పొగలు రావడంతో వెంటనే ఆయన అక్కడి నుంచి లేచి మరో సీట్లో కూర్చున్నారు. ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేయడంతో ఆయన సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. షాట్ సర్క్యూట్ వల్ల మైక్ నుంచి పొగలు వచ్చి ఉంటాయని రాజ్యసభ సభ్యులు తెలిపారు. మైక్‌ను సరిచేయాలని ఛైర్మన్ వెంకయ్యనాయుడు సిబ్బందిని ఆదేశించారు. కాగా.. కేజే ఆల్ఫోన్స్‌కు విద్యుత్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







