దుబాయ్‌లో 16 ఏళ్ల బాలుడిపై కీచక పర్వం..
- July 29, 2019
దుబాయ్‌లో దారుణం చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలుడిపై ఐదుగురు పురుషులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కీచక పర్వం సంచలనం సృష్టించింది. ఐదుగురు పురుషులు ఓ విల్లాకు 16 ఏళ్ల బాలుడిని తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 19 వుంచి 25 ఏళ్ల వయస్సున్న ఐదుగురు నిందితులను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ కేసు విచారణలో భాగంగా.. 16ఏళ్ల బాలుడిని కారులో ఎక్కించుకుని విల్లాకు తీసుకెళ్లారని.. ఏప్రిల్ 18వ తేదీన ఆ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఘటన అల్ ఖుసైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్నాప్ చాట్ ద్వారా స్నేహితుడైన ఓ వ్యక్తి కలవమని పిలవడంతో వెళ్లానని బాధితుడు వాపోయాడు.
అలా వెళ్ళిన తనను స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన వ్యక్తి స్నేహితుడిని పంపి తనకు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడ నుంచి ఐదుగురు తనను విల్లాకు తీసుకెళ్లారని.. అక్కడ ఓ గదలో నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపాడు.
కత్తులతో బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని.. మరుసటి రోజు ఇంటికి తిరిగి పంపారని బాధితుడు చెప్పాడు. ఈ తతంగాన్ని వీడియో తీసి బెదిరించారని.. కానీ ఇంటికొచ్చిన ఆ యువకుడు ఈ విషయాన్ని తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాగోతం బయటపడింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







