అబుదాబీ - అజ్మన్‌ బస్‌ సర్వీస్‌ ప్రారంభం

- July 29, 2019 , by Maagulf
అబుదాబీ - అజ్మన్‌ బస్‌ సర్వీస్‌ ప్రారంభం

అబుదాబీ మరియు అజ్మన్‌ మధ్య ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు కొత్త బస్‌ సర్వీస్‌ని ప్రారంభిస్తున్నారు. ఆగస్ట్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్‌ సర్వీస్‌లో ఒక్కో ప్రయాణీకుడికి 30 దిర్హామ్‌లు టిక్కెట్‌ ధరగా నిర్ణయించారు. ఐటిసి మరియు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ - అజమ్మన్‌ ఈ మేరకు మెమొరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌పై సంతకం చేయడం జరిగింది. అబుదాబీ అజ్మన్‌ రూట్‌లో బస్సులు నడపడం ద్వారా ఈ మార్గంలో ప్రయాణం సులభతరమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌ అబుదాబీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com