కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా
- July 29, 2019
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అసెంబ్లీలో చదివి వినిపించారు. సంకీర్ణ సర్కారులో 14 నెలల పాటు స్పీకర్ గా పనిచేశారాయన. అంతకుముందు ఆర్ధిక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇవాళ బీజేపీ సర్కార్ విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. స్పీకర్ రాజీనామా చేస్తారనే ప్రచారం ఆదివారం నుంచి కొనసాగుతోంది. ఇందుకు అనుగుణంగా స్పీకర్ తన రాజీనామా లేఖను సభలో చదివి వినిపించడం విశేషం. మరోవైపు, స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు సర్వోన్నత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై 2023 వరకు అనర్హత వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ కాంగ్రెస్‌కు చెందిన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటళ్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్… రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







