తెలంగాణ:విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
- July 30, 2019
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) నోటిఫికేషన్ జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్ట్ 03 లేదా 23వ తేదీన 2 వేల 525 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, 2 వేల జూనియర్ లైన్ మెన్ పోస్టులను భర్తీ చేయనుంది. అక్టోబర్ 13 ఉదయం జేపీఓ పోస్టులకు, మధ్యాహ్నం జేఎల్ఎం పోస్టులకు, అక్టోబర్ 20 ఉదయం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్ట్ 03న నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఆగస్ట్ 06 నుంచి జూనియర్ లైన్ మెన్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జేపీఓ పోస్టులకు 14 నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 21 నుంచి దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. 23వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తే 26 నుంచి జేఎల్ఎం పోస్టులకు, 27 నుంచి జేపీఓ పోస్టులకు, 28 నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







