కేఫ్ కాఫీ డే ఫ్యాక్టరీ గేట్లు మూసివేత
- July 30, 2019
కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యం కావడంతో చికుమంగళూరులోని కేఫ్ కాఫీ డే ఫ్యాక్టరీ గేట్లు మూసివేశారు. అందులో పనిచేసే ఉద్యోగులను ఇళ్లకు వెళ్లిపోవాలని అక్కడి సిబ్బంది చెప్పారు. సిద్ధార్థ అదృశ్యంపై కేఫ్ కాఫీ డే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఫ్యాక్టరీ బయట వేచి ఉన్న ఓ కార్మికుడు మాట్లాడుతూ.. ఆయన తమకు దేవుడితో సమానమని, మేం మూడు పూటలా తినగలుగుతున్నామంటే ఆయన చలవేనని చెప్పాడు.
ఇదిలా ఉంటే.. సిద్ధార్థ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన నేత్రావతి నదిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నదిలో గజ ఈతగాళ్లతో పాటు కొన్ని బృందాలు వెతుకులాట మొదలుపెట్టాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..