ఒమన్‌లో ఇండియన్‌ ప్రొఫెసర్‌కి అత్యుత్తమ టీచింగ్‌ అవార్డ్‌

- July 30, 2019 , by Maagulf
ఒమన్‌లో ఇండియన్‌ ప్రొఫెసర్‌కి అత్యుత్తమ టీచింగ్‌ అవార్డ్‌

మస్కట్‌: ఒమన్‌లోని ఓ ఇండియన్‌ ప్రొఫెసర్‌, గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ బాడీ నుంచి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. సుల్తానేట్‌లో టీచింగ్‌ స్టాండర్డ్స్‌ని పెంచేందుకు ఆయన చేసిన కృషికి గౌరవ సూచకంగా ఈ అవార్డు దక్కింది. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ హెడ్‌గా డాక్టర్‌ సయ్యద్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ పనిచేస్తున్నారు. ఒమన్‌ ఎడ్యుకేషన్‌ లీడర్‌షిప్‌ అవార్డ్స్‌ 2019లో బెస్ట్‌ ప్రొఫెసర్‌ ఇన్‌ స్టాఇస్టిక్స్‌ స్టడీస్‌లో అవార్డ్‌ అందుకున్నారాయన. వలర్డ్‌ ఎడ్యుకేషన్‌ కాంగ్రెస్‌ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసింది. 'ఇది బెస్ట్‌ ప్రొఫెసర్‌ అవార్డ్‌. అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఈ అవార్డ్‌కి ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది' అని నిర్వాహకులు తెలిపారు. 2003లో ఒమన్‌కి డాక్టర్‌ రిజ్వాన్‌ వచ్చారు. అప్పటినుంచీ ఆయన నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీతో మమేకం అయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com