తిరుమల వెళ్తున్నారా? ఈ సూచనలు పాటించండి.

- July 31, 2019 , by Maagulf
తిరుమల వెళ్తున్నారా? ఈ సూచనలు పాటించండి.

తిరుమలలో రూమ్, దర్శనం గురించి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన గోవింద యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే రూమ్‌ నుంచి దర్శనం వరకు అన్ని సేవలు బుక్‌ చేసుకోవచ్చు. మరి ఆ యాప్‌ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

  1. తిరుమల భక్తులు ఇబ్బందులు పడకూడదని సాంకేతికతను ఉపయోగించుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). తిరుమల భక్తుల కోసం రెండేళ్ల క్రితమే గోవింద యాప్‌ రూపొందించింది.
  2. ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇటీవలే ఐఫోన్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది గోవింద యాప్‌.
  3. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా గోవింద యాప్‌ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 
  4. గదుల దగ్గర్నుంచి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను ఈ యాప్‌లో పొందొచ్చు. గోవింద యాప్‌లో మీరు ఏ సేవలు పొందాలన్నా ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  5. శ్రీవారి భక్తులకు గోవింద యాప్‌ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చాలారోజుల ముందుగానే గదులు బుక్‌ చేసుకోవచ్చు. పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రణాళికతో ముందే గదులు బుక్‌ చేసుకోవడం మంచిది.
  6. మీకు ఏ రోజున ఎలాంటి గది కావాలో యాప్‌లో చూసి బుక్‌ చేయొచ్చు. తిరుమల మాత్రమే కాదు తిరుపతిలో కూడా గదులను బుక్‌ చేసుకోవచ్చు.
  7. ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా గోవింద యాప్‌లో పొందొచ్చు. ఇందుకోసం తేదీని ఎంపిక చేసి స్లాట్‌ బుక్‌ చేసుకొని పేమెంట్‌ పూర్తి చేయాలి.
  8. ఇక తిరుమలలో రోజువారీగా నిర్వహించే సేవల టికెట్లను కూడా యాప్‌లో పొందొచ్చు. విశేష పూజ, కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను యాప్‌లో పొందొచ్చు.
  9. టీటీడీ నిర్వహించే సేవ ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం గోవింద యాప్‌లో పేరు నమోదు చేయొచ్చు. టీటీడీకి చెందిన సప్తగిరి మ్యాగజైన్‌కు మీరు గోవింద యాప్‌లోనే సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. 
  10. తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించాలనుకునేవారికి యాప్‌లోనే హుండీ ఉంటుంది. హుండీ ట్యాబ్‌ క్లిక్‌ చేసి మీరు ఎంత సమర్పించుకోవాలనుకుంటున్నారో అన్ని రూపాయలను టైప్‌ చేయాలి. 
  11. ఏ సందర్భంగా హుండీలో డబ్బులు వేయాలనుకుంటున్నారో కూడా వెల్లడించొచ్చు. అంటే మొదటి జీతం, పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా ఏదైనా కారణాన్ని వివరించొచ్చు. ఏవైనా విరాళాలు ఇవ్వాలనుకన్నా యాప్‌లోనే సాధ్యం.
  12. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీవెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్జరీ, రీసెర్చ్‌ అండ్‌ రిహ్యాబిలిటేషన్‌ ఫర్‌ ది డిసేబుల్డ్‌ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్‌ ప్రివెన్షన్‌ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్‌ ట్రస్ట్, శ్రీ వెంటకేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర వేదపరిరక్షణ ట్రస్ట్, శ్రీవెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్, శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్, శ్రీ బాలాజి ఆరోగ్యవర ప్రసాదిని స్కీమ్, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్‌లకు మీరు విరాళాలు యాప్‌లో ఇవ్వొచ్చు. 
  13. మీరు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు పొందాలంటే కనీసం రూ.1,000 విరాళమివ్వాలి. అప్పుడే మీకు ఐటీ డిడక్షన్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది.
  14. గూగుల్‌ ప్లే స్టోర్‌లో తిరుమల పేరుతో చాలా యాప్స్‌ ఉన్నాయి. వాటిని కాకుండా టి.టి.డి రూపొందించిన గోవింద యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com