కాఫీడే బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా రంగనాథ్‌ నియామకం

- July 31, 2019 , by Maagulf
కాఫీడే బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా రంగనాథ్‌ నియామకం

బెంగళూరు : కేఫ్ కాఫీడే అధినేత వి.జి.సిద్ధార్థ మరణించిన నేపథ్యంలో కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు బాధ్యతలను ఎస్‌.వి.రంగనాథ్‌కు అప్పగించారు. తాత్కాలిక ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 1975 కేడర్ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.వి.రంగనాథ్‌ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. అంతేకాదు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్‌కు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.

అయితే ఇప్పటికే ఆయన కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డులో సభ్యుడిగా ఉండటంతో తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించారు. ఇదివరకు ఎస్‌.వి.రంగనాథ్‌ ఇండియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌సెంటర్‌ బోర్డు డైరెక్టర్లలో ఒకరు కావడం విశేషం. ఈ నేపథ్యంలో బుధవారం నాడు జరిగిన బోర్డు సమావేశంలో ఆయనను తాత్కాలిక ఛైర్మన్‌గా నియమిస్తూ బోర్డు ఓకే చెప్పింది.

ఇన్నాళ్లపాటు వి.జి.సిద్ధార్థ కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌కు ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆకస్మిక మృతితో మంగళవారం నాడు రెగ్యులేటరీలకు సమాచారం అందించింది కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌. నిపుణులు, మేధావుల సలహాలు సూచనలతో కంపెనీని నిర్వహిస్తామని పేర్కొంది. అయితే బుధవారం నాడు 19 శాతం మేర తగ్గిన కాఫీడే షేర్లు.. మంగళవారం నాడు 20 శాతం మేర తగ్గిపోవడం గమనార్హం. అదలావుంటే కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు నెక్ట్స్ట్ మీటింగ్ ఆగస్టు 8వ తేదీన జరగనున్నట్లు వెల్లడించారు.

వి.జి.సిద్దార్థ సతీమణి మాళవిక హెగ్డే కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. అలాగే డాక్టర్‌ ఆల్బర్ట్‌ హైరోనిమస్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంజయ్‌ ఓంప్రకాశ్‌ నాయర్‌ నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌, నామినీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సులక్షణ రాఘవన్‌ కూడా బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com