మత పిచ్చిగాడికి జొమాటో ఇచ్చిన గట్టి కౌంటర్
- July 31, 2019
మత పిచ్చి కొందరిలో ముదిరిపోతోంది. ఎంతగా అంటే వేరే మతం వాళ్లు ఫుడ్ డెలివరీ చేసినా సహించలేనంతగా. ఢిల్లీలో ఇలాంటి మతపిచ్చి ఉన్న వ్యక్తి ఉదంతం బయటపడింది. అతడిని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. నడిరోడ్డులో ఏ లారీనో గుద్దేసి పడిపోయి ఉంటే అప్పుడు ఎవరైనా రక్షించేందుకు ముందుకు వస్తే అప్పుడు కూడా మీ మతం ఏమిటి అని అడుగుతావా? అంటూ సదరు వ్యక్తిని దులిపేస్తున్నారు. దేశంలో మనుషుల మధ్య అంతరాలు పెరగడానికి ఇలాంటి మూర్ఖులే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ మేటర్ ఏమిటంటే. ఢిల్లీకి చెందిన అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ దాన్ని తీసుకుని వచ్చాడు. వచ్చిన డెలివరీ బాయ్ హిందువు కాదంటూ ఫుడ్ తీసుకునేందుకు అతడు అంగీకరించలేదు. తనకు ఇతర మతస్తుల ద్వారా ఆహారం పంపించవద్దని జొమాటోతో వాదన పెట్టుకున్నాడు. అయితే అమిత్ శుక్లా విజ్ఞప్తిని జొమాటో తిరస్కరించింది. తాము వివక్షను ఆమోదించబోమని స్పష్టం చేసింది. మరో బాయ్‌ని పంపేందుకు నిరాకరించింది. దాంతో అమిత్ శుక్లా ఫుడ్ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ అంశాన్ని జొమాటో ట్వీట్ చేసింది. ఇంతగా మతపిచ్చితో వ్యవహరించిన అమిత్ శుక్లాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అమిత్ శుక్లా పట్ల జొమాటో వ్యవహరించిన తీరును నెటిజన్లు సమర్ధిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







