డ్రగ్స్‌తో కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల అరెస్ట్‌

- August 02, 2019 , by Maagulf
డ్రగ్స్‌తో కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల అరెస్ట్‌

కువైట్‌: ఎయిర్‌ పోస్ట్‌ కస్టమ్స్‌ డ్రగ్స్‌ తరలిస్తున్న ప్రయాణీకుల్ని కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ 1, టెర్మినల్‌ 5 వద్ద అరెస్ట్‌ చేయడం జరిగింది. డ్రగ్స్‌ని వీరు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు వారి నుంచి డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ మీడియా కమిటీ మెంబర్‌ నవాఫ్‌ అల్‌ మటార్‌ మాట్లాడుతూ, టెర్మినల్‌ 1 వద్ద అరబ్‌ ప్రయాణీకుడి నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో అరబ్‌ వ్యక్తి టెర్మినల్‌ 5 వద్ద అధికారులకు డ్రగ్స్‌తో చిక్కాడు. అతని నుంచి 1,500 నార్కోటిక్‌ పిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క, ఆసియాకి చెందిన ప్రయాణీకుడ్ని హాషిష్‌ కలిగి వున్న కారణంగా అరెస్ట్‌ చేశారు అధికారులు. అరెస్ట్‌ చేసిన ముగ్గుర్నీ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత విభాగాలకు అప్పగించడం జరిగింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com