అటానా స్టే అల్‌ అష్‌ఖారా ప్రారంభం

- August 03, 2019 , by Maagulf
అటానా స్టే అల్‌ అష్‌ఖారా ప్రారంభం

మస్కట్‌: ఒమన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కంపెనీ (ఒమ్‌రాన్‌), అటానా స్టే అల్‌ అస్‌ఖారాని ప్రారంభించింది. స్థానిక ఎంప్లాయిమెంట్‌ని పెంచడం అలాగే డొమెస్టిక్‌ టూరిజంని అభివృద్ధి చేసే క్రమంలో ఈ హోటల్‌ ప్రారంభం కూడా ఓ భాగమని అధికారులు పేర్కొన్నారు. సౌత్‌ అల్‌ షర్కియా గవర్నర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ ముస్తాహైల్‌ షమ్మాస్‌ ఈ హోటల్‌ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూనిక్‌ మరియు వరల్డ్‌ క్లాస్‌ టూరిజం ఎస్సెట్స్‌లో భాగంగా అటానా స్టే అష్‌ఖారా ప్రారంభం కూడా ఒకటని అధికారులు వివరించారు. ఈ హోటల్‌లో 46 రూమ్‌లు అల్‌ అష్‌ఖారా మరియు అల్‌ షర్కియా అథెంటిసిటీని ప్రతిబింబిస్తాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com