కోటి విలువ బంగారం స్మగ్లింగ్ ఆరోపణలపై ఆరుగురు భారతీయుల అరెస్టు
- August 05, 2019
కొలంబో:రూ.1.7 కోట్ల విలువచేసే బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో ఆరుగురు భారతీయులను శ్రీలంకలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడి అధికారులు అరెస్టు చేశారు. కటునాయకేలో ఉన్న ఈ విమానాశ్రయంలోని శ్రీలంక సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విమానాశ్రయంలోని 'డిపార్చ్ టెర్మినల్' వద్ద నలుగురు భారతీయుల వద్ద నుండి 1.06 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, ప్రత్యేక దర్యాప్తులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుండి 1.370 కిలోల బంగారాన్ని స్వాధీన పరుచుకున్నామని పోలీసులు వెల్లడించారు. మొత్తంగా రూ.1.7 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పర్యాటక వీసాపై శ్రీలంక వెళ్లిన భారతీయులు తిరిగి స్వస్థలానికి చేరుకుంటున్న సమయంలో విమానాశ్రయంలో ఈ సోదాలు నిర్వహించారు. నిందితులను శ్రీలంక కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







