జమ్మూకాశ్మీర్‌లో 144 సెక్షన్‌ అమలు

- August 05, 2019 , by Maagulf
జమ్మూకాశ్మీర్‌లో 144 సెక్షన్‌ అమలు

జమ్మూకాశ్మీర్‌లో అర్ధరాత్రి తర్వాత పరిణామాలు మారిపోయాయి. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రమంతటా భద్రతా అధికారులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. రాష్ట్రమంతా 144 సెక్షన్ విధిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ సభలు, ప్రదర్శనలకు అనుమతి నిరాకరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతో పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. కిష్టావర్‌, రాజౌరి, రాంబస్‌ జిల్లాల్లో కర్ఫ్యూ విధించగా, పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతో పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్‌తో పాటు జమ్మూ, రెశాయ్‌, దోడా జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com