ఇజ్రాయిల్‌ను ఎవరు సమర్థించినా వ్యతిరేకిస్తాం
- August 05, 2019
అంకారా: ఈ ఏడాది ఆరంభంలో ఏడేళ్ల పాలస్తీనా చిన్నారులను హత్య చేసిన వారిని సమర్ధిస్తున్న ఇజ్రాయిల్, అమెరికాలపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను ఎవరు సమర్ధించినా వారిని తాము వ్యతిరేకిస్తామని ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ 'యూదు రాజ్య' చట్టాన్ని అమలులోకి తేవటంపై ఆయన స్పందిస్తూ ఈ చర్యతో కొంతమంది ఇజ్రాయిలీ నేతలలో హిట్లర్ స్ఫూర్తి మళ్లీ తలెత్తుతోందనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. టర్కీ రష్యా నుండి ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయటంతో ఆ దేశానికి ఎఫ్35 యుద్ధ విమానాల విక్రయాలను అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్డొగాన్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







