ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది..

- January 06, 2016 , by Maagulf
ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది..

పరీక్షించిన ఉత్తర కొరియావిజయవంతమైదని ప్రకటన జపాన్ చైనా దేశాల దిగ్భ్రాంతిఆందోళన వ్యక్తం చేసిన అమెరికాతీవ్రంగా ఖండించిన నాటో దేశాలు ప్యాంగ్ యాంగ్ : ఉత్తర కొరియా బుధవారం హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. ఉత్తర కొరియా జరిపిన ఈ పరీక్ష ప్రభావానికి తొలుత భూ ప్రకంపనలు సంభవించాయి. అవి భూమి లోపల కదలికల వల్ల ఈ ప్రకంపనలు సంభించినట్లు తొలుత అభిప్రాయాలు వెలువడ్డాయి.కాని ఆ తరువాత అసలు కారణం వెల్లడైంది. అది భూకంపం కాదని, అణ్వస్త్ర పరీక్షేనని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. తొలిసారిగా తాము తయారు చేసిన హైడ్రోజన్ బాంబు పరీక్ష విజయవంతమైందని ఆ దేశ అధికారిక చానెల్ బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు తాము నిర్వహించిన తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష విజయవంతమైందని విస్పష్టంగా పేర్కొంది. ఈ పరీక్షతో ఉత్తర కొరియా తన అణ్వస్త్ర పాటవాన్ని మరింత పెంచు కున్నట్లు అయింది. 'మా దేశ తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష 2016 జనవరి 6 (బుధవారం)న విజయవం తమైంది. అధికార వర్కర్స్ పార్టీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం మేరకే ఈ పరీక్ష దిగ్విజయంగా నిర్వహించాం' అని ఆ దేశ అధికారిక టీవీ చానెల్ న్యూస్ రీడర్ తెలియ జేశారు. వాస్తవానికి తమ దేశ తాజా అణు పరీక్షకు అను మతి ఇస్తూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్ మూడు వారాల క్రితమే ఒక ఉత్తర్వుపై స్వయంగా సంతకం చేశారు. 'ఉత్సుకత రేపే ధ్వని'తో హైడ్రోజన్ బాంబు విస్ఫోటంతో 2016కు స్వాగతం పలకాలని కిమ్ జాంగ్ ఆ సందర్భంలో పిలుపు ఇచ్చారు. ఇది ఇలా ఉండగా, ఉత్తర కొరియా నిర్వహించిన ఈ పరీక్ష ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేసింది. ఈ పరీక్ష ప్రభావంతో సంభవించిన భూ ప్రకంపనలు పొరుగున ఉన్న చైనాలో అధికారులను సందేహంలో పడేశాయి. ఉత్తర కొరియా మరో మారు అణు పరీక్షలను నిర్వహించి ఉంటుందని వారు అనుమా నించారు. చైనా భూకంపం నెట్‌వర్క్ సెంటర్ దీనిని అనుమానాస్పద పేలుడుగా గుర్తించింది. అయితే, ఉత్తర కొరియాలో భూకంపాలు అంతగా తలెత్తే అవకాశం లేదని యూరోపియన్ భూకంప కేంద్రం తేల్చిచెప్పిన దరిమిలా తాజాగా సంభవించిన భూకంపంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షను ఖండించిన అమెరికా కాగా, ఉత్తర కొరియా చేపట్టిన హైడ్రోజన్ బాంబు పరీక్షను అమెరికా ఖండించింది. ఐక్యరాజ్య సమి తి (యుఎన్) తీర్మానాలను ఆ దేశం ఉల్లంఘించిందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్టు ధ్రువీకరించ లేకపోతున్నామని అభిప్రాయపడింది. యుఎన్ తీర్మానం ప్రకారం ఉత్తర కొరియా ఎటువంటి అణు పరీక్షలు లేదా క్షిపణి పరీక్షలు కానీ చేయరాదు. మరో వైపు కొరియా మా త్రం అమెరికా లక్ష్యంగానే హైడ్రోజన్ బాంబు పరీక్షించి నట్టు తెలిపింది. అగ్ర రాజ్యం అమెరికా దగ్గర భారీ సంఖ్య లో అణ్వాయుధాలు ఉన్నాయని, ఆత్మ రక్షణ కోసమే బాంబు పరీక్షలు జరిపినట్టు ఉత్తర కొరియా పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com