ఆర్టికల్ 370 రద్దుతో ఏంటి ప్రయోజనాలు?
- August 05, 2019
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కావడంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి? మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తుంటే.. కొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ ఆర్టికల్‌లోని అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.. -ఆర్టికల్ 370 ప్రకారం.. జమ్మూకశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది. కానీ ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్ పౌరులందరికీ ఒకే పౌరసత్వం వర్తించనుంది. -జమ్మూకశ్మీర్ పతాకం భిన్నంగా ఉండేది. భారత జాతీయ చిహ్నాలు అవమానిస్తే నేరం కాదు. ఇప్పుడు భారత పతాకమే జమ్మూకశ్మీర్ పతాకం. కశ్మీర్లో భారత జాతీయ చిహ్నాలు అవమానిస్తే ఇప్పుడు నేరం. - ఆర్టికల్ 370 రద్దుకు ముందు శాసనసభ్యుల పదవీకాలం ఆరేండ్లు.. కానీ ఇప్పుడు శాసనసభ్యుల పదవీకాలం ఐదేళ్లు మాత్రమే. -గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు చెల్లుబాటు అయ్యేవి కావు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో భారత సుప్రీంకోర్టు ఆదేశం చెల్లుబాటు అవుతాయి. భారత పార్లమెంట్ చట్టాలన్నీ జమ్మూకశ్మీర్‌కు వర్తించనున్నాయి.
గతంలో మాదిరిగా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉండవు. కాగ్ నిబంధనలు, ఆదేశాలు వర్తిస్తాయి. తలాక్ చట్టం అమలు కానుంది. -ఆర్టికల్ 370 రద్దుతో భారతీయులంతా కశ్మీర్లో భూమిని కొనే అవకాశం ఏర్పడింది.
కాశ్మీరేతరులకు కూడా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. -ఒక కశ్మీరీ మహిళ భారతదేశంలోని ఇతర రాష్ట్రంలోని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ మహిళక కశ్మీరీ పౌరసత్వం కోల్పోయేది. కానీ ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరి మహిళ ఆ పౌరసత్వాన్ని కోల్పోదు. -కశ్మీరి మహిళ పాకిస్తానీని పెళ్లి చేసుకుంటే అతను కశ్మీర్ పౌరసత్వం పొందుతాడు. ఇప్పుడు అతను కశ్మీరీ పౌరసత్వం పొందడానికి వీలు లేకుండా పోయింది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు