ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన పాకిస్తాన్
- August 05, 2019
జమ్ము-కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ స్పందించింది. దీనిపై మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ కురేషీ "ఆర్టికల్ 370 రద్దు చేయడంపై భారత్ చాలా ప్రమాదకరమైన ఆట ఆడింది. దీని ప్రభావం మొత్తం ప్రాంతంపై చాలా భయానకంగా ఉండచ్చు. ఇమ్రాన్ ఖాన్ ఈ అంశాన్ని పూర్తిగా చర్చల వైపు తీసుకెళ్లాలని భావించారు. కానీ భారత్ తన నిర్ణయంతో ఈ అంశాన్ని మరింత జటిలం చేసింది. కశ్మీరీలను ఇప్పటికే రాష్ట్రంలో బంధించారు. మేం ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాం. ఇస్లామిక్ దేశాలకు కూడా దీని గురించి చెప్పాం. ముస్లింలు అందరూ కలిసి కశ్మీరీల సంక్షేమం కోసం ప్రార్థనలు చేయాలి. పాకిస్తాన్ పూర్తిగా కశ్మీరీలకు అండగా ఉంటుంది" అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!